టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా : లోకేష్

Politics Published On : Monday, January 27, 2025 12:55 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పదవికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. 

'మిమ్మల్ని సీఎంగా చూస్తామా? డిప్యూటీ సీఎంగా చూస్తామా?' అన్న మీడియా ప్రశ్నపై మంత్రి స్పందిస్తూ చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అహర్నిశలు కష్టపడతానని, పార్టీని బలోపేతం చేస్తానని, అంతేగానీ పార్టీకి చెడ్డపేరు తీసుకురానని తెలిపారు. "ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు ఉండకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే నేను కూడా ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నా' అంటూ వ్యాఖ్యలు చేశారు.