గో బ్యాక్ నాగబాబు..టిడిపి నినాదాలు..!
కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగబాబు పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు బలబలాలు ప్రదర్శించుకుంటున్నారు. జై వర్మ జైజై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తలు, జై జనసేన అంటూ జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
దీంతో పిఠాపురంలో పోలీసులు భారీగా మోహరించారు. జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ ఇంచార్జి వర్మపై నాగబాబు పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.