చంద్రబాబుకు తెలంగాణ మంత్రి లేఖ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని కోరారు.
టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంటుందని, వారి తీరుతో ప్రజాప్రతినిధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని, దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆమె కోరారు.
See Full Gallery Here...