Big News: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయ్ సాయి రెడ్డి
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయం ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు... పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.