అందుకే జగన్ కు దూరమయ్యా: విజయసాయి రెడ్డి
కోటరీ వల్లే జగన్‌కు దురమయ్యానని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. మీ మనసులో నాకు స్థానం లేదని, అందుకే పార్టీని వీడుతున్నానని జగన్‌కి చెప్పానన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్‌కు చెప్పానని, నా మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు.
విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని, నేను వైసీపీలో చేరనని చెప్పారు. జగన్ నన్ను పార్టీలో ఉండమన్నారని, మళ్లీ వైసీపీ ఘర్ వాపసీ ఉండదని స్పష్టం చేశారు. జగన్‌కు తన కేసులో ప్రమేయం లేదన్నారు. నేను ప్రలోభాలకు లొంగిపోయానని మా నాయకుడు అన్నారని, కానీ లొంగలేదని పేర్కొన్నారు.