రాబోయే 30 యేళ్లు మేమే.. వెంట్రుక కూడా పీకలేరు: వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేసారు. వైసిపి బతుకుందని, రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు ఏలుతుందని వ్యాఖ్యలు చేశారు. ఎవరూ పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. గతంలో మ్యానిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామన్నారు.
అప్పుడేమో హామీలు అమలు కాకపోతే కాలర్ పట్టుకోమన్నారని, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి సర్కారుపై విమర్శలు ఎక్కు పెట్టారు. సంపద సృష్టించడం ఎలాగో తమనే చెప్పమంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.