చంద్రబాబు హయాంలో ఒక్క అప్పడాల మెషిన్ కూడా రాలేదు
చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని వైసీపీ విమర్శించింది. 'అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్ల కాలంలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో టూర్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి' అని ట్వీట్ చేసింది.