40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం: వైసిపి
చంద్రబాబు 40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని వైసిపి విమర్శించింది. ఎన్నికల్లో కపట హామీలు ఇచ్చి గెలిచాక వాటి ఊసే ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. వాలంటీర్లు, ఏపీ అప్పు, సూపర్ సిక్స్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు, పోలవరం విషయంలో మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేసింది.
ఇప్పటికే మండలిలో ప్రభుత్వాన్ని వైసిపి ప్రశ్నిస్తోందని, శాసనసభలోనూ ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత నిలదీస్తారని చంద్రబాబు భయపడుతున్నారని తెలిపింది. వైసిపి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో తెలియజేయండి.