YS జగన్ ఎఫెక్ట్... ఎట్టకేలకు దిగొచ్చిన చంద్రబాబు
జగన్ ఎఫెక్ట్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగొచ్చారు. జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు మిర్చి ఘాటు ఏపీ రాజకీయాలకు బలంగా తాకింది.
మిర్చి రైతులు దీనస్థితిలో ఉన్నారని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పంట కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మాజీ CM జగన్ గుంటూరు మిర్చి యార్డ్లో రైతులతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. జగన్ నిలదీస్తే తప్ప సీఎంకు రైతుల సమస్యలు కనిపించవా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.