బట్టలు ఊడదీసి నిలబెడతాం.. వైఎస్ జగన్ మాస్ వార్నింగ్: వీడియో
కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. విజయవాడ జైలులో వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టి, వారు చెప్పినట్లు చేసి అన్యాయం చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదన్నారు.
రేపు మళ్లీ మేము అధికారంలోకి వస్తామని, అన్యాయం చేసిన అధికారులు, నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతామని, "ఎవ్వరినీ వదిలిపెట్టం. రిటైరైనా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం' అని జగన్ వార్నింగ్ ఇచ్చారు.