ఓడిపోయినా తానే రాజు అనిపించుకుంటున్న జగన్

Politics Published On : Sunday, December 29, 2024 10:12 AM

వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావం నుండి ప్రతి నిత్యం ప్రజలలోనే ఉండేవారు. అలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చాక, ఇటు జనానికి అటు వైసీపీ శ్రేణులకు పూర్తిగా దూరమయ్యాడు. అయితే అధికార కోల్పోయాక తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే జగన్ కోసం ప్రజలు పోటెత్తారు. జగన్ నుంచి ప్రధానంగా వైసీపీ కార్యకర్తలు కోరుకునేది కేవలం ఈ పలకరింపే అని పలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పటికీ వైఎస్ జగన్నే ఇప్పటికీ సీఎం భావిస్తున్నారని ప్రజా దర్బార్ లో కొందరు అనుకున్నారని చెప్పుకొచ్చారు.