మరో ప్రజా ప్రస్థానం షర్మిల రాజకీయ జీవితం ఇదే

Politics Published On : Wednesday, March 24, 2021 01:00 PM

మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బ్రతుకులు మార్చే బాట. వైయస్ఆర్ కుటుంబానికి తెలుసు. షర్మిలమ్మ నాయకత్వం వర్దిల్లాలి..!!’ అని ఫ్లెక్సీలో ఉంది. ఈ ఫ్లెక్సీలో వైఎస్సార్, షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ‘జనంలోకి వస్తుంది షర్మిలక్క.. జనరంజకపాలన ముందుందిక’ అని మరో ఫ్లెక్సీలో ఉంది. ఇందులో కూడా షర్మిల ఫొటో మాత్రమే ఉంది కానీ జగన్ ఫొటో లేదు. ఇలా పెద్ద ఎత్తున వెలిసిన ఫ్లెక్సీల్లో ఒక్క చోట కూడా వైఎస్ జగన్ ఫొటో లేకపోవడం గమనార్హం. మరోవైపు వైఎస్ అభిమానులు, అనుచరులు మీడియాతో మాట్లాడుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.


వైయస్ జగన్ సోదరి షర్మిల వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుల ఆరోపణలపై జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర నిర్వహించారు.  2012 - 2013 సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా  మరో ప్రజా ప్రస్థానం" పేరుతో వైసీపీ పార్టీని జనాలకు చేరువ చేశారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012 లో జరిగిన ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చారు.జూన్ నెలలో జగనును అరెస్టుచెయ్యగా, ఉప ఎన్నిక ప్రచారానికై జగను పార్టీ అభ్యర్థికొండ సురేఖ తరుపున ఆమె ప్రచారములో పాల్గొనటం ద్వారా ఆమె ప్రత్యక్షరాజకీయ జీవితం మొదలైనది. అంతకుముందు ఆమె, అనేక క్రిస్టియను మతప్రచారసభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవమున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నిర్వహించింది

జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ ఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపథ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా మరో ప్రజా ప్రస్థాపన పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు.

మొత్తం 16 జిల్లాల్లో దాదాపు  3,112 కి.మీ పాదయాత్ర జరిపింది.  ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళగా షర్మిలా గుర్తింపు గడించారు.  తనతండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ) నుండి ప్రారంభమైన పాదయాత్ర  శ్రీకాళం జిల్లాలో ఇచ్చాపురంలో ముగిసింది. 8 నెలలు సాగిన పాదయాత్రలో 14 జిల్లాల్లో 116 నియాజకవర్గాల మీదుగా సాగింది.ఇందులో 9 కార్ఫోరేషన్లు, 45 మున్సిపాలిటిలు, 195 మండలాలు ఉన్నాయి.ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది.మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగింది. 152 ప్రదేశాలలల్ఫో బారీ స్థాయిగా జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికి పైగా జనాలను షర్మిలా ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా వేసారు.

జగనన్న వదిలిన బాణం అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా?

పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17 న గాయం అగుటవలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది.అమె కాలికి అపోలో ఆస్పత్రిలో ఆపరేషను చేసి, ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకొనవలసినదిగా సలహానిచ్చారు. రికవరీ అయిన తరువాత తిరిగి మళ్లీ  ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ఆరంభించింది.

ఇచ్ఛాపురంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో తను ప్రతి పక్షసభ్యుడుగా వున్నప్పుడు చేవెల్ల నుండి పాదయాత్రచేపట్టి 68 రోజులపాదయాత్రచేసి,1,473 కి.మీ ఇచ్ఛాపురం వరకు నడచి, పాదయాత్ర ముగించిన సందర్భంగా అక్కడ నిర్మించిన విజయవాటిక స్మారక స్తూపానికి ఎదురుగనే షర్మిలా మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం విజయ ప్రస్థానం నిర్మించి, ఆవిష్కారం చేసారు.
 
షర్మిలా పాదయాత్ర జరిపిన జిల్లాలు :1.వైస్సార్,2.అనంతపురం,3.కర్నూలు, 4.మహబూబ్ నగర్,5.రంగారెడ్డి, 6.నల్లగొండ, 7.గుంటూరు,8. కృష్ణా.9.ఖమ్మం, 10.పశ్చిమ గోడావరి, 11.తూర్పు గోదావరి, 12.విశాఖపట్నం, 13.విజయనగరం, 14.శ్రీకాళం.

ఇప్పుడు జరుగుతున్న ఆత్మీయ సమావేశంలో కొత్త పార్టీపై కార్యకర్తలతో షర్మిల దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ఆంధ్ర ముద్ర ఉంది కాబట్టి తెలంగాణలో కొత్త పార్టీ స్థాపిస్తారా..? లేకుంటే ఇక్కడ కూడా వైసీపీతోనే ముందుకెళ్తారా..? అనే విషయంపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.