ఎన్టీఆర్ జిల్లా పేరు ఎందుకు మార్చలేదు: వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని తెలి పారు.
NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారని, YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదని అన్నారు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్నించారు.