విజయసాయి రెడ్డి రాజీనామాపై ఎట్టకేలకు స్పందించిన వైఎస్ జగన్
వైసిపి సీనియర్ నేత విజయసాయి రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసిపి అధినేత వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. 'మాకు 11 మంది రాజ్యసభఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు." అని పేర్కొన్నారు.
రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమని, అది సాయిరెడ్డికైనా, ఇప్పటి వరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుందని, క్యారెక్టర్ను బట్టే ఉంటుందని తెలిపారు. వైసిపి కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుందని తెలిపారు.