అసెంబ్లీకి వెళ్లాలని వైసిపి నిర్ణయం
సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైసిపి నిర్ణయం తీసుకుంది. వరుసగా 60రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ఆస్కారం ఉంది. దీంతో ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ గత సమావేశాలకు హాజరుకాని విషయం తెలిసిందే.