చంద్రబాబూ ముస్లిం సమాజం నిన్ను క్షమించదు: వైసిపి

Politics Published On : Saturday, April 5, 2025 08:51 PM

వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. గుంటూరు, విజయవాడలో వర్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై మైనార్టీలు నిరసన తెలిపిన విషయాన్ని పేర్కొంటూ వైసీపీ ట్వీట్ చేసింది. 'గుంటూరు, విజయవాడలో మా పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీలు నిర్వహించారు. బిల్లుకు మద్దతిచ్చి చంద్రబాబు చేసిన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబూ ఇంత మోసం చేస్తావా? ముస్లిం సమాజం ఇక నిన్ను క్షమించదు' అని ట్వీట్ లో పేర్కొంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...