ఆ ఇద్దరి మధ్య అగాధం తవ్వాలని చూస్తే.. ఆ అగాధంలో పడి చచ్చేది మీరే...!!
పనికిమాలిన బుర్రకు పనికిమాలిన ఆలోచనలే వస్తాయి. చెత్తపలుకులో సుత్తిరాతలు పరాకాష్టకు చేరుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి బాధాకృష్ణ కడుపు మండిపోతున్నట్లుంది. విజయసాయి రెడ్డి దూకుడు చూసి కడుపు మండుతున్నట్లుంది. ఏం చేయాలో పాలుపోక చెత్తపలుకులో బాధా కృష్ణ పిచ్చి రాతలు రాస్తున్నట్లు అనిపిస్తోంది. చంద్రబాబు అండ్ కో ఎన్ని తలనొప్పులు పెడుతోన్న ఏపీ పాలనా రథాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసనీయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలకుండా చూస్కోడానికి విజయసాయి రెడ్డి ఉన్నారు. ఢిల్లీలో తన మంత్రాంగంతో ముఖేష్ అంబానీనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి నమస్కారం పెట్టించిన చాణుక్యుడు విజయసాయి రెడ్డి. ఎక్కడ ఏ ముడి విప్పాలో..ఎక్కడ ఏ ముడిని గట్టిగా వేయాలో విజయసాయి రెడ్డికి బాగా తెలుసు. నేను ఇంతకు ముందే చెప్పాను .విజయసాయి రెడ్డికి అకౌంట్సే కాదు పొలిటికల్ స్టాటిస్టిక్స్ బాగా తెలుసని. అటువంటి వ్యక్తినే బాధాకృష్ణ పెన్నుతో గెలుకుతున్నారు. అక్షరాలను అడ్డుపెట్టుకుని విజయసాయి రెడ్డితో ఆడుకోవాలని చూడటం నిప్పుతో చెలగాటం ఆడటమే. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల మధ్య ఏదో ఆగాధం ఉందని చెప్పడానికి బాధాకృష్ణ తెగ ప్రయత్నించారు. విజయసాయి రెడ్డి సుజనా చౌదరి గురించి మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి రాయడం బాధాకృష్ణకే చెల్లింది. ఇటువంటి రాతలు రాస్తాడు కాబట్టే...చెత్తపలుకులో సుత్తి రాతలు రాస్తారని నేను అనేది. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడానికి బాధా కృష్ణ చాలా ప్రయత్నించారు. సుజనా చౌదరి ఓ డిఫాల్టర్. ప్రజలు బ్యాంక్‌ల్లో దాచుకున్న సొమ్ముతో విలాసాలు చేస్తోన్న వ్యక్తి. రాజకీయ నాయకుడి ముసుగులో ఆర్ధిక వ్యభిచారం చేస్తున్న వ్యక్తి సుజనా చౌదరి. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం కోవర్ట్ పనులు చేస్తోన్న అవకాశవాది సుజనా చౌదరి. బాధా కృష్ణకు సూటిగా ఓ ప్రశ్న వేయాలి అనుకుంటున్నాను. విజయసాయి రెడ్డికి సుజనా చౌదరి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కటేనా?. కాదు కదా?. వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మిన బంటు విజయసాయి రెడ్డి. మహానేత వైఎస్ఆర్తో చాలా మంచి సంబంధాలు విజయసాయి రెడ్డికి ఉన్నాయి. విజయసాయి రెడ్డిని 'సాయి' అని వైఎస్ఆర్ ఎంతో ఆప్యాయత, ప్రేమతో పిలిచేవారు. చాలా కాలంగా వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన అకౌంట్స్ విజయసాయి రెడ్డే చూస్తున్నారు. విజయసాయి రెడ్డిపై వైఎస్ఆర్ కుటుంబానికి మంచి గురి.వైఎస్ఆర్ కుటుంబం విజయసాయి రెడ్డిని విశ్వసించినట్లు మరేవరిని విశ్వసించదు. విజయసాయి రెడ్డి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ - చంద్రబాబు కలిసి కుట్రలు పన్ని కేసులు పెట్టినప్పుడు కూడా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కుటుంబా న్ని వీడలేదు. పొలిటికల్ కుట్రలో భాగంగా చేయని తప్పుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా జైలు శిక్ష అనుభవించారో, విజయసాయి రెడ్డి కూడా జైలు శిక్ష అనుభవించారు. నమ్మకం, విశ్వాసం అనేవి విజయసాయి రెడ్డి సహజంగా వచ్చిన గుణాలు. "వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో తాను కీలు బొమ్మ కాదని పది మందికి తెలియజేయడం కోసం, తనను తక్కువ అంచనా వేయొద్దనే సంకేతాలు విజయసాయి రెడ్డి పంపారని చెత్త పలుకులో రాశారు". ఒక మాటను, ఒక ప్రకటనను తీవ్రస్థాయిలో వక్రీకరించి రాయడంలో బాధాకృష్ణకు మించిన వారులేరని ఈ లైన్ చదివిన తరువాత అర్ధమైంది. ఎక్కడ సుజనా?!!, ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...?!!, ఎక్కడ విజయసాయి రెడ్డి..?!!, ఎక్కడ కీలు బొమ్మా...?!!. ఇదే కదా జర్నలిజాన్ని ఖూనీ చేయడమంటే బాధాకృష్ణా..?!!.
విజయసాయి రెడ్డితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. విజయసాయి రెడ్డి ఏం చేసినా తన మంచి కోసమే చేస్తారని వందశాతం నమ్ముతారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞా విజయసాయి రెడ్డికి శిరోధార్యం. రామునికి హనుమంతుడు ఎలానో, చంద్రగుప్తునికి చాణుక్యుడి ఎలానో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అలాగా...!!. విజయసాయి రెడ్డి ఆలోచించే ప్రతి ఆలోచనలో, మాట్లాడే ప్రతి మాటలో చంద్రబాబు చెత్త రాజకీయాలను తుత్తునీయులు చేయడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీమంగా ఇబ్బందుల్లేకుండా చేయాలనే రెండు అంశాలు దాగి ఉంటాయి. ఎవరో గుంటూరు మిత్రుడు చెప్పాడు, కారు డ్రైవర్ చెప్పాడు, గోడ పక్కన ఉన్న పాపాయమ్మ చెప్పింది అని రాసి జర్నలిజాన్ని చంపేసే బదులు ఇప్పటికైనా బాధా కృష్ణ వాస్తవాలు రాయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షణ కవచం విజయసాయి రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే విజయసాయి రెడ్డిని దాటుకుని వెళ్లాలని చంద్రబాబుకు, మీకు బాగా తెలుసు అనుకుంటా..?!!.
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అత్యద్భుతంగా ఉంది. చంద్రబాబు అండ్ కో విమర్శలను ప్రజలు పట్టించుకోవగడం లేదు. తెలుగు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో విమర్శలు చేయించినా ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. సీపీఐ రామకృష్ణ, నారాయణ, కాంగ్రెస్ తులసీ రెడ్డి వీరందరూ చంద్రబాబు బిస్కెట్లకు ఆశ పడేవారని ప్రజలు గమనించారు. చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడుపోయారనే విషయం ప్రజలందరికీ తెలుసు.అయితే..విజయసాయి రెడ్డి దీనిపై ఓ ప్రకటన చేసి అధికార ముద్ర వేశారు. చంద్రబాబుకు కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని, దీనికి మధ్య వర్తిత్వం చేసింది బీజేపీలో ఉన్న టీడీపీ మనిషి సుజనా చౌదరి అని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద కన్నా చెలరేగిపోయారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అన్నారు. చివరికి సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య కన్నా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. కన్నాకు రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు మనుషులు తప్పిస్తే నిజమైన కాషాయవాదులు ఎవరూ మద్దతు పలకలేదు. ఈ ఘటనతో ఏపీ బీజేపీలో చంద్రబాబు మనుషులు ఎవరో స్పష్టంగా తేలిపోయింది. బాధాకృష్ణ ఇవన్నీ చెప్పకుండా డైవర్ట్ చేయడానికి విజయసాయి రెడ్డి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఏదో అగాధం ఉందని చిత్రీకరించడానికి తన జర్నలిజం ముసుగును వాడుకున్నారు. ఇక్కడ చంద్రబాబు, బాధాకృష్ణ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఎంపీ విజయసాయి రెడ్డి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య మీ కలాలతో , మీ క్షుద్ర రాజకీయాలతో మీ జీవిత కాలంలో ఆగాధం సృష్టించలేరు. ఈ వాస్తవాన్ని బాధా కృష్ణ బాగా గుర్తు పెట్టుకోవాలి. మీ లోగుట్టు, చంద్రబాబు లోగుట్టు, సుజనా లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక కాబట్టే మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో దేవుడు అక్కడ ఉంచాడు. నేను బాధాకృష్ణకు ఒక్కటే చెబుతున్నాను మీ కుల కలాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిల మధ్య అగాధం తవ్వాలని చూస్తే ఆ అగాధంలో పడి చచ్చేది మీ ఎల్లో గ్యాంగే అని గుర్తు పెట్టుకుంటే మంచిది..!!.
ఇక..బాధాకృష్ణ రాతల్లో నాకు అర్ధమైందీ ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఏడుపు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినా దానిని తప్పుపట్టడం బాధా కృష్ణ, బాబుకే చెల్లింది. దేశానికి కోర్టులు ప్రమాణీకం కాదు అనే విషయాన్ని బాధా కృష్ణ, బాబులు గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశంలో పటిష్టమైన పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. ఈ దేశంలో పటిష్టమైన శాసన వ్యవస్థ ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలు ఓట్లు వేసి కట్టబెట్టిన ప్రభుత్వాలదే తుది నిర్ణయం. కోర్ట్లు వాచ్ డాగ్‌లు మాత్రమే. కోర్టులు తప్పుపడితే నీలం సంజీవ రెడ్డి రాజీనామా చేశారు, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు అని గుర్తు చేయడంలో మీ ఉద్దేశం ఏంటీ?. కోర్టులు తప్పులు పడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడంలేదనా?. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడానికి కాదు ప్రజలు 151 సీట్లు ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం మాత్రమే తెలుసు, వ్యవస్థలను మేనేజ్ చేయడం అనైతికం అనుకుంటారు. వ్యవస్థలను మేనేజ్ చేసే ఓ అసమర్ధుడు చంద్రబాబు రూపంలో బాధాకృష్ణకు పాలకుడిగా ఉండాలి. నీతిమంతంగా, అవినీతి రహితంగా, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్న వైఎస్ జగన్ సీఎంగా బాధకృష్ణకు ఉండకూడదు. ఎందుకంటే..వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఆలోచిస్తారు, బాధా కృష్ణ లాంటి అక్షరాలను అమ్ముకునే పెట్టుబడిదారుల గురించి ఆలోచించరు.బాధా కృష్ణకు పవర్ ప్రాజెక్ట్‌లు, కమీషన్లు, యాడ్లు రావు. బాధా కృష్ణకు టీడీపీ హయాంలో శ్మశానాలకు కూడా పసుపు పచ్చ రంగు వేశారు. పంచాయతీలు, నీళ్ల ట్యాంక్‌లు, , అన్నా క్యాంటీన్లు దేన్నీ వదలకుండా పచ్చ రంగు వేశారు. ఇవేవీ బాధకృష్ణ భూతద్దాలకు కనిపించవు. వైఎస్ఆర్ రంగులు మాత్రం కనిపిస్తాయి. చంద్రబాబు చే స్తే సంసారం, వైసీపీ చేస్తే వ్యభిచారమా?. సిగ్గుండాలి బాధాకృష్ణ. చివరకు నాలుగు రంగులు వేస్తున్నా కూడా ఎల్లో గ్యాంగ్ రచ్చ చేస్తుంది. మట్టి రంగు వేస్తే మంచిదే కదా..?. దీనికి రాధాకృష్ణకు ఉన్న అభ్యంతరమేంటీ? .
కరోనా ప్రపంచమంతా కరాళ నృత్యం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేస్తూనే ఇంట్లో ఉండే ప్రజలను ఆదుకుంటుంది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేస్తున్నారు. దాతల నుంచి బియ్యం, కూరగాయలు, పండ్లు సేకరించి పంచి పెడుతున్నారు. వీరి సేవను గుర్తించకుండా ఇష్టం వచ్చినట్లు రాసి, చూపిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అనుకోవడం భ్రమ. నిజమైన ప్రజాసేవకులు ఎవరో, క్షుద్ర రాజకీయాలు చేసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డు ఎవరో ప్రజలు గుర్తించారు. ఎల్లో ఛానల్స్‌ను ప్రజలు నమ్మడం లేదు. ఈ విషయం చంద్రబాబుకు బోధ పడింది. ప్రజాసేవ చేస్తున్నా వైఎస్ఆర్ సీపీ నాయకులపై బురద జల్లే బదులు , ఇంట్లో నక్కిన టీడీపీ నాయకులు బయటకు వచ్చి ప్రజాసేవ చేయవచ్చు కదా?. చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు ఇప్పటికీ అమరావతి గురించే ఆలోచిస్తున్నారు కానీ..కరోనాపై పోరాటంలో కలిసి రావడంలేదని ప్రజలు అర్ధం చేసుకున్నారు.
బాధాకృష్ణ చెత్త పలుకులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఉండవు. చెత్త పలుకు పని కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే. ఈ విషయం ప్రజలకు, మేధావులకు, విద్యావేత్తలకు అర్ధమైంది. పారిశ్రామిక వేత్తలకు కూడా అర్ధమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల మనిషి కాదు చేతల మనిషి అని దేశం మొత్తం ఆర్ధం చేసుకుంది. చంద్రబాబు పుట్టిన రోజు ప్రధాని మోదీ కనీసం ట్విట్ కూడా చేయలేదు. అంతకముందే ప్రధాని తనకు కాల్ చేసి మాట్లాడరని చెప్పుకున్న చంద్రబాబుకు పుట్టిన రోజు నాడు మోదీ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. దీని ద్వారా బాబుతో తాను మాట్లాడలేదని ప్రధాని మోదీ స్పష్టమైన సంకేతాలు పంపారు. తన 40 ఏళ్ల అనుభవంలో చంద్రబాబు అబద్దాలకు పదును పెట్టడం, ప్రజలను మభ్య పెట్టడం బాగా నేర్చుకున్నారు. బాధాకృష్ణ, ఎల్లో మీడియా అధినేతలు ఎంత ప్రయత్నించినా చంద్రబాబును మోదీకి దగ్గర చేయలేరు. చంద్రబాబుపై మోదీ - అమిత్ షాలకు స్పష్టమైన క్లారిటీ ఉందని ఓ ఆర్ఎస్ఎస్ నేత నాకు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను చాలా దగ్గరగా చూస్తున్నామని, కేంద్రం కూడా గమనిస్తుందని మంచి పాలన అందిస్తున్నారని అని కూడా ఆ ఆర్ఎస్ఎస్ నేత చెప్పారు. బీజేపీకి చంద్రబాబు కంటే కూడా వైఎస్ జగన్‌తో ఉంటేనే ప్రయోజనాలు ఎక్కువన్నారు. ఈ విషయాన్ని బీజేపీ కూడా గమనించిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపడటం దక్షిణాదిలో కూడా బీజేపీకి మంచిదని ఆయన విశ్లేషించారు. చంద్రబాబు మీడియా రాజకీయాలు, అవకాశవాద , అవినీతి రాజకీయాలు ఇక చెల్లవని, చంద్రబాబును నమ్మేస్థితిలో కేంద్రంలేదని ఆర్ఎస్ఎస్ నేత చెప్పారు. ఇప్పటికైనా బాధాకృష్ణ తన కలంతో వాస్తవాలు రాస్తే రాష్ట్రానికి మంచిది . ఏపీలో బీజేపీని నాశనం చేసింది చంద్రబాబు అండ్ ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న నేత కాదా?. 1999లో బీజేపీ ఏపీలో చాలా బలంగా ఉండేది. ఆనాడు వాజ్‌పేయి, కా ర్గిల్ ఇమేజ్ను వాడుకుని అధికారంలోకి వచ్చి అదే బీజేపీని బాబు తొక్కింది నిజం కాదా?. టీడీపీని బతికించుకోవడానికి బీజేపీని చంపింది నిజం కాదా? ఇవన్నీ నిఖార్సుగా రాసే దమ్ము బాధాకృష్ణకు ఉందా?.
- వై. వి. రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్