అందుకే అసెంబ్లీకి జగన్: వైవి సుబ్బారెడ్డి
ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు.
వైసిపి నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. జగన్ కు భద్రత కల్పించకపోవడం దారుణమని, వీటన్నింటిపై జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారని పేర్కొన్నారు.