కోహ్లి ఖాతాలో మరో రికార్డ్..!
భారత బ్యాటర్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డ్ చేరింది. టీ20ల్లో 13 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా ఆయన చరిత్ర సృష్టించాడు. 386 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించగా కోహ్లి కంటే ముందు నలుగురు విదేశీ ఆటగాళ్లున్నారు.
ఈ మేరకు IPL 18 సీజన్ లో భాగంగా ముంబై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఈ మైలు రాయి చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి 42 బంతుల్లో 67 పరుగులు చేశారు. 8 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు.