ఛాంపియన్స్ ట్రోఫీ: ఆ రెండు జట్లకూ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. రెండు జట్లకూ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. భారీ స్కోర్లు నమోదయ్యే లాహోర్ పిచ్ పై ఈ పోరు జరగనుంది.
ఆస్ట్రేలియాకు కమిన్స్, స్టార్క్, హేజిలవుడ్, మార్ష్ వంటి ప్లేయర్లు దూరం అయ్యారు. ఇంగ్లండ్ భారత్ చేతిలో వైట్ వాష్ అయి పేలవంగా కనిపిస్తోంది. మరి ఈ రోజు రెండింటిలో ఏ జట్టు బోణీ కొడుతుందో వేచి చూడాలి.