వరల్డ్ కప్ ఫైనల్ లో సత్తా చాటిన తెలుగు యువతి గొంగడి త్రిష
మహిళల టీ20 అండర్ 19 ప్రపంచ కప్ లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా ఇవాళ సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ జరిగింది. తుదిపోరులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆట ముంగించింది.
దీంతో అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో భారత్ సునాయసంగా విజయం సాధించింది. భారత బౌలర్లలో భద్రాచలం యువతి గొంగిడి త్రిష సత్తా చాటింది. కీలక మ్యాచ్ లో గొంగడి త్రిష మూడు వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు వైష్ణవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. భారత బ్యాటర్లలో త్రిష 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.