ఐపీఎల్ ఆరంభ వేడుకకు బాలీవుడ్ తారలు..
ఐపీఎల్ 2025 మహాసంగ్రామానికి మరో 5 రోజుల్లో తెర లేవనుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు జరిగే అరంభ వేడుకను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు దిశా పటానీ, శ్రద్ధా దాస్, సింగర్స్ కరణ్ ఆజ్లా, శ్రేయా ఘోషల్ స్పెషల్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మార్చి 22న జరిగే తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.