IPL 2025: ఉత్కంఠ పోరులో చెన్నై విజయం
ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నె సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నోను సొంత గడ్డపై ఓడించింది. అయితే చెన్నె ఐదు సార్లు వరుసగా ఓడిపోయి ఇప్పుడు గెలవడంతో ఫాన్స్ కు కాస్త ఊరట లభించింది. ఆఖరిలో ధోని బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేశారు. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19.2 ఓవర్లలో లక్ష్యం చేదించింది.