IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా నేను బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో బెంగుళూరును సొంత గడ్డపై ఓడించింది. మొదట ఢిల్లీ బ్యాటర్స్ తడబడినా తరువాత KL రాహుల్ (93) సిక్స్ లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో ఆట ఒక్కసారిగా మారిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే చేదించింది.