IPL 2025: ఢిల్లీ కెప్టెన్ కు భారీ జరిమానా
ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ అడ్వెజరీ కమిటీ అతనికి జరిమానా విధించింది. రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ తమ 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నియమావళి ప్రకారం ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ కు జరిమానా విధించారు.