IPL 2025: CSK కెప్టెన్ గా ధోని?
గత నెల 30న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. రేపు ఢిల్లీతో జరిగే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో ధోనీ మరోసారి కెప్టెన్ గా నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై CSK యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.