IPL 2025: గుజరాత్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బెంగళూరును సొంత గడ్డపై ఓడించింది. బట్లర్ 73 పరుగులతో, సాయి సుదర్శన్ 49 పరుగులతో రాణించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగుల లక్ష్యాన్ని చేదించింది.