ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లు విడుదల ఎప్పుడంటే..
ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లను మంగళవారం విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. పాకిస్తాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరిగే 10 మ్యాచ్ల టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దుబాయ్ వేదికగా జరిగే ఇండియా మ్యాచ్ల టికెట్లను త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపింది. మార్చి 9న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్లు 4 రోజుల ముందు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.