టి-20 ప్రపంచ కప్ : భారత జట్టు ఘన విజయం
అండర్-19 టీ20 మహిళల ప్రపంచ కప్ లో మంగళవారం మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు విజృంభించడంతో మలేసియా 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (27) కమలిని (4) పరుగులు చేశారు. భారత బౌలర్ వైష్ణవి శర్మ చివరి ఓవర్ లో హ్యాట్రిక్ వికెట్లు సాధించింది. వైష్ణవి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ఈ నెల 23న భారత్ తదుపరి మ్యాచులో శ్రీలంకతో తలపడనుంది.