హైదరాబాద్ వేదికగా ఐపిఎల్ మ్యాచులు
హైదరాబాద్ వేదికగా ఐపిఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచులు జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది ఐపీఎల్ రన్నరప్ గా హైదరాబాద్ నిలిచిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులు ఉప్పల్లోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది విజేతగా నిలిచిన KKR హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్లను నిర్వహించనున్నారని సమాచారం. కాగా SRH తొలి మ్యాచ్ వచ్చే నెల 23న మధ్యాహ్నం ఆడనున్నట్లు తెలుస్తోంది. మొత్తం షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.