ఐపిఎల్ చూసే వారికి జియో బిగ్ షాక్..

Sports Published On : Friday, February 14, 2025 06:41 PM

జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చూసే వారికి జియో బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ తో సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ + హాట్‌స్టార్‌ అన్ని ఐసీసీ టోర్నమెంట్‌ల హక్కులను పొంది ఉంది. ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. అయితే రూ.149 నుండి ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకుంటేనే ఈ మ్యాచ్ లను చూసే అవకాశం ఉంటుంది.

జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం ఇప్పటికే పూర్తైంది. ఈ యాప్కు జియో హాట్ స్టార్ అని పేరు పెట్టారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటి కిందకు చేరడంతో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా అవతరించింది. ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట కనిపించనుంది. ప్లేస్టోర్లో జియో సినిమాకు100 మిలియన్, హాట్ స్టార్ కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. 

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...