IPL 2025: ఆడుతూ పాడుతూ KKR విజయం
ఐపిఎల్ లో బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 151 పరుగులు చేసింది. ఛేదనలో డికాక్ అర్ధసెంచరీతో ఆడుతూ పాడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్లో కోల్కతాకు ఇది తొలి విజయం కాగా రాజస్థాన్ కు వరుసగా ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.