ఇంగ్లండ్ క్రికెటర్ పై నెటిజన్ల ట్రోల్స్

Sports Published On : Thursday, February 27, 2025 10:36 AM

ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తామని ఇంగ్లండ్ క్రికెటర్ డకెట్ గతంలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ చేతితో ఇంగ్లండ్ ఓటమి పాలవడంతో ఇంగ్లండ్ క్రికెటర్ డకెట్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 

భారత్ను ఫైనల్లో ఓడిస్తామన్నావుగా.. ఇప్పుడేమైంది?' అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఇండియాపై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయాక డకెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మేం 3-0 తేడాతో ఓడినా పెద్ద మ్యాటర్ కాదు. మేం ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. అప్పుడు ఈ ఓటమిని ఎవరూ గుర్తుంచుకోరు' అని అన్నారు. కానీ చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...