IPL 2025: గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్
ఐపీఎల్ 18వ సీజన్ లో పలు జట్లు కీలక ఆటగాళ్లను గాయాల వల్ల కోల్పోతున్నాయి. గాయపడినవాళ్ల స్థానంలో కొత్తవాళ్లను తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఐపీఎల్ కు దూరమయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని గుజరాత్ మరొక ఆల్ రౌండర్ శ్రీలంక ఆటగాడు దసున్ శనకతో ఈ మధ్య ఒప్పందం చేసుకుంది. శనకకు గుజరాత్ రూ.75 లక్షలు చెల్లించినట్లు ఆ జట్టు ఫ్రాంచైజీ తెలిపింది.