భారత్ - పాక్ మ్యాచ్.. పాక్ కు భారీ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా, పాకిస్తాన్ మధ్య పోరు ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచుకు ముందు పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టు కీలక ప్లేయర్ ఫఖర్ జమాన్ మ్యాచుకు దూరమైనట్లు పీసీబీ పేర్కొంది.
నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో గాయం కారణంగా మధ్యలోనే ఫీల్డ్ వీడగా ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపింది.దీంతో అతడు దుబాయ్ వెళ్లట్లేదని వెల్లడించింది. ఫఖర్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ ను తీసుకుంటారని తెలుస్తోంది.