భారత క్రికెటర్లను హగ్ చేసుకోవద్దు.. పాక్ ప్లేయర్లకు అభిమానుల హెచ్చరిక

Sports Published On : Saturday, February 15, 2025 09:03 PM

భారత క్రికెటర్లను పాకిస్తాన్ ప్లేయర్లు హగ్ చేసుకోవద్దని పాక్ అభిమానులు హెచ్చరిక జారీ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నెల 23న భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లితో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లను హగ్ చేసుకోవద్దని సందేశాలు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, పాక్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ వార్నింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.