IPL 2025: పంజాబ్ ఘన విజయం
IPL 2025: లక్నోతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో ఛేదించింది. ప్రభుసిమ్రన్ సింగ్ 69 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు, వధేరా 43 పరుగులు చేశారు. లక్నో బౌలర్ దిగ్వేశ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు లక్నో బ్యాటర్లలో పూరన్ 44, బదోనీ 41, మార్క్రమ్ 28, సమద్ 27, మిల్లర్ 19 పరుగులు చేశారు. అర్ష్ దీప్ 3, ఫెర్గూసన్, మ్యాక్స్వెల్, మార్కో, చాహల్ చెరో వికెట్ తీశారు.