సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ
కటక్ రెండో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 76 బంతుల్లో 102 పరుగులు చేశాడు. దీంతో రోహిత్ శర్మ వన్డేల్లో 32వ సెంచరీ చేశాడు. 7 సిక్స్ లు, 9 ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో వన్డేల్లో రోహిత్ శర్మకి రెండో ఫాస్టెస్ట్ సెంచరీ దక్కింది.
2023లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాధిన రెండో ఆటగాడిగా స్థానం దక్కించుకున్నాడు. వన్డేల్లో 336 సిక్స్ లు కొట్టిన రోహిత్ శర్మ క్రిస్ గేల్(331)ను దాటి రెండో స్థానానికి చేరుకున్నాడు. 351 సిక్స్ లతో షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో ఉన్నాడు.