RCB కొత్త కెప్టెన్ రజత్ పటిదార్
ఐపీఎల్ 2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నూతన కెప్టెన్ ను ప్రకటించింది. యువ ఆటగాడు రజత్ పాటిదార్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్‌మెంట్ అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
పాటిదార్ 2021 నుంచి ఆర్‌సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇటీవల మెగా వేలానికి కన్నా ముందు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో అతడు ఒకడు. ఇప్పటి వరకు పాటిదార్ ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 34.7 సగటుతో 158.8 స్ట్రైక్‌రేటుతో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధికంగా 112 పరుగులు చేశాడు.