రాజస్థాన్ రాయల్స్ కు షాక్..!
ఐపీఎల్ 2025 మరో వారంలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కు బెంగళూరులోని ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
దీంతో 23న సన్ రైజర్స్ తో జరిగే మ్యాచుకు ఆయన దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆడినా బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లేదంటే ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.