IPL 2025: SRH హ్యాట్రిక్ ఓటమి
IPL 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ (SRH) 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది.
క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 పరుగులు మినహా అందరూ సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2 వికెట్లు, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.