వాట్సాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్
వాట్సాప్ యూజర్లకు ఆ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తమ వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ నంబర్ నుంచి కాంటాక్ట్స్ ఉన్న వారిని డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారు.
ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయితే వెంటనే వాట్సాప్ సపోర్ట్ను కాంటాక్ట్ చేసి రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఖాతా హ్యాక్ అవకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.