17 ఏళ్ల తరువాత లాభాల్లోకి బిఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వెళ్లింది. 2007 తర్వాత తొలిసారిగా లాభాల్ని చూసింది. ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో రూ.262 కోట్ల లాభం సాధించినట్లు ప్రకటించింది.
కొత్త ఆవిష్కరణలు, వినియోగదారుల సంతృప్తి, దూకుడుగా నెట్వర్క్ విస్తరణ వంటివి లాభాలకు దోహదం చేశాయని సంస్థ సీఎండీ రాబర్ట్ జే రవి తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవడం కూడా లాభించిందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లాభాలు 20శాతం దాటొచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు.