భారత్ కు సొంత బ్రౌజర్..!
భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్ ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్ కు ఇదో సదవకాశమని తెలిపారు.
బ్రౌజర్ కోసం పోటీలు నిర్వహిస్తే విద్యా సంస్థలు, స్టార్టప్లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్ ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.