వాట్సాప్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాట్సాప్ లో బగ్ గుర్తించామని కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ హెచ్చరికలు చేసింది. వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ 2.2450.6 కంటే పాత వెర్షన్ వాడుతున్నట్లయితే యూజర్ల సిస్టమ్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.