గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న యూజర్లకు సర్ట్ ఇన్ హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. విండోస్, మాక్, క్రోమ్ బుక్లోని 132.0.6834.110/111 కంటే ముందు వెర్షన్లతో ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
ఆ వెర్షన్లలో CIVN-2025-0007, CIVN-2025-0008 త్రెట్స్ ను గుర్తించినట్లు తెలిపింది. వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు దాడి చేయొచ్చని, వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయొచ్చని హెచ్చరించింది. మొబైల్ బ్రౌజర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.