RBI: ఇకపై రూ. 5 వేల వరకు పిన్ లేకుండా తీసుకోవచ్చు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కాంటాక్ట్‌లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్ల పరిమితిని వచ్చే జనవరి 1 నుంచి రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు వెల్లడించింది. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీల పరిమితిని జనవరి ఒకటి నుండి రూ. 2 వేల నుండి రూ. 5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. సురక్షిత డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్ అవసరాల మేలావాదేవీల పరిమితిని పెంచుతున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు రూ. 2 వేల వరకు చెల్లింపులు, ‘లావాదేవీ’ పిన్ నంబర్ లేకుండా జరుపుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని రూ. 5 వేల వరకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయించింది. ఆర్‌టీజీఎస్’ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) కూడా 24X7 అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించారు. అనునిత్యం ఏఈపీఎస్, ఐఎంపీఎస్, ఎన్‌ఈటీసీ, ఎన్‌ఎఫ్‌ఎస్, రూపే, యూపీఐ లావాదేవీల సదుపాయముంటుందని వెల్లడించారు. ఇప్పటికే గతేడాది డిసెంబర్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) 24 గంటలూ అందుబాటులోకి వచ్చింది.
నెట్ బ్యాంకింగ్ బదిలీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డ్ పేమెంట్స్ వంటి డిజిటల్ లావాదేవీలకు సంబంధించి మరింత భద్రత చేకూరేలా నిబంధనలను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా... లావాదేవీల వైఫల్యం రేటు కనిష్టానికి తగ్గనుందని తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఆర్‌బీఐ భద్రతా నియంత్రణకు అధిక ప్రాముఖ్యతనిస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
డిజిటల్ పేమెంట్లను మరింత సురక్షిత వాతావరణంలో జరిగేలా చూస్తాయమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ల పరిమితి అధికారాన్ని కూడా ఈ మధ్యే కస్టమర్లకు కట్టబెట్టారు. తాజా పరిమితి పెంపుపై కూడా కస్టమర్‌కే విచక్షణాధికారం ఉంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.