మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి..

Technology Published On : Saturday, February 22, 2025 02:00 PM

మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీపేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలిసిపోతుంది. ముందుగా https://tafcop.dgtelecom.gov.in/index.php వెబ్సైట్లోకి వెళ్లాలి. అక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

తర్వాత ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీ పేరుపై ఉన్న సిమ్ కార్డు నెంబర్లు కనిపిస్తాయి. అవి మీరు ఉపయోగిస్తూ ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఆ సిమ్ కార్డులు మీరు వాడకపోతే అవి మీవి కాదని ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.