గూగుల్ పే వాడే వారికి గుడ్ న్యూస్
G-PAY వాడే వారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. గూగుల్ పేలో త్వరలోనే AI ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వాయిస్ కమాండ్లతోనే UPI లావాదేవీలు చేసేందుకు అవకాశం కలగనుంది.
ప్రస్తుతం సంస్థ దీనిపై ప్రయోగాలు చేస్తుండగా, త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా చదువులేని వారు కూడా సులభంగా లావాదేవీలు చేయవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అన్ని భారతీయ భాషలను ఇందులో చేర్చేలా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.