గూగుల్ నుంచే వాట్సాప్ కాల్.. త్వరలోనే అందుబాటులోకి..

Technology Published On : Wednesday, February 12, 2025 07:44 AM

గూగుల్ మెసేజెస్ మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా వాట్సాప్ వీడియో కాల్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా Google meet వీడియో కాల్స్ మాత్రమే చేసుకునేందుకు అవకాశం ఉంది.

అయితే యాప్ను స్విచ్ చేసుకునే అవసరం లేకుండా యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త ఫీచర్ను గూగుల్ తీసుకురానుంది. మొదట వన్ ఆన్ వన్ కాల్ కు మాత్రమే ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ అయి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది.